![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ రోజు రోజుకి ట్విస్ట్ లతో ఆకట్టుకుంటుంది. సోమవారం నాటి ఎపిసోడ్ లకు-247 లో.. కృష్ణ అగ్రిమెంట్ పూర్తయిందని వెళ్ళిపోతానని రేవతితో చెప్పడంతో తను కోపంగా మురారి దగ్గరికి వచ్చేస్తుంది. మురారి దగ్గరికి వచ్చిన రేవతి.. మీకు నచ్చినట్డు చేయండి రా, నేను చెప్తే వింటారా, ఎన్ని రోజులని నేను మిమ్మల్ని కలపాలని చూస్తాను. ఎవరిదారి వారు చేసుకుంటున్నారు కదా, మీరిద్దరు విడిపోయి హ్యాపీగా ఉందామనుకుంటున్నారు కదా ఉండండి అని మురారితో రేవతి ఏడుస్తూ అంటుంది.
కృష్ణ, మురారీలను కలపాలని చూస్తున్న రేవతిని చూసిన మురారి.. అమ్మ ఎందుమ్మా ఇలా మాడ్లాతున్నావ్ అని అడుగుతాడు. మరేంట్రా అగ్రిమెంట్ అంట విడిపోతారంట అని రేవతి అనగానే.. లేదు అమ్మ, తనంటే నాకు ఇష్టం, కాదు ప్రాణం అని మురారి చెప్తాడు. అది విని రేవతి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. అప్పటివరకు కంటతడిపెట్టుకున్న రేవతి.. ఎప్పుడైతే కృష్ణ లేకపోతే తను బ్రతకలేనని మురారి చెప్పగానే పొంగిపోతుంది. అయ్యో పిచ్చోడా.. నీ మనసులో ఉంది బయట పెట్టడానికి ఇదంతా చేసానని మురారీతో రేవతి అంటుంది. కృష్ణతో నేను మాట్లాడతా అని రేవతి తన దగ్గరికి వెళ్తుంది.
కృష్ణ బ్యాగ్ లో బట్టలు సర్దుకొని ఒక దగ్గరికెళ్ళి ఏడుస్తుంది. అప్పుడే రేవతి తన దగ్గరికి వెళ్ళి.. ఏంటి కృష్ణ ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య అని అంటుంది. అన్నీ సర్దుకున్నావా? పదా మనింటికి వెళ్దామని రేవతి అనగానే కృష్ణ ఆశ్చర్యపోతుంది. అప్పుడే కృష్ణకి వాళ్ల బాబాయ్ కాల్ చేస్తాడు. బయల్దేరుతున్నాని కృష్ణ ఫోన్ లో చెప్తుంటే రేవతి ఆ ఫోన్ లాక్కొని.. మీరెవరో నాకు తెలియదు. నేను కృష్ణ వాళ్ల అత్తయ్యని, తనెక్కడికి రాదు మా ఇంట్లోనే ఉంటుందిని చెప్తుంది. ఆ తర్వాత ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు నేను మా ఇంటికి వెళ్తానని చెప్పాను కదా అని రేవతితో కృష్ణ అంటుంది. నువ్వంటే మురారికి ప్రాణం, నువ్వు ఎక్కడ దూరమవుతావేమోనని ఇక్కడికి డ్యూటీ వేయించుకున్నాడని కృష్ణతో రేవతి అంటుంది. లేదు అత్తయ్య తన మనసులో నేను లేనని కృష్ణ అంటుంది. వాడి మనసంతా నువ్వే ఉన్నావ్.. ఇంకెవరూ లేరు, పదా నువ్వు ఎక్కడ వెళ్లిపోతావేమో అని వాడు టెన్షన్ పడుతున్నాడని రేవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |